Home / BUSINESS / 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..?

10 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..?

చాలామంది స్మార్ట్‌ఫోన్ కొనాల‌నుకుంటారు కానీ.. బ‌డ్జెట్ ఉండ‌దు. త‌క్కువ ధ‌ర‌లో బెస్ట్ ఫోన్ కావాల‌నుకుంటారు కానీ.. ఏ ఫోన్ కొనాలో.. ఏ ఫోన్ ధ‌ర ఎంత ఉంటుందో స‌రిగ్గా తెలియ‌దు. నిజానికి.. ఎక్కువ ధ‌ర పెడితేనే బెస్ట్ ఫోన్ వ‌స్తుంది అనేది అపోహ మాత్ర‌మే. బ‌డ్జెట్ ధ‌ర‌లో కూడా ప్ర‌ముఖ బ్రాండ్స్ నుంచి బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రియ‌ల్‌మీ, రెడ్‌మీ, సామ్‌సంగ్‌, మైక్రోమాక్స్, లావా, టెక్నో లాంటి బ్రాండ్స్ నుంచి 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు చేయొచ్చు.

రెడ్‌మీ 9 యాక్టివ్ – Redmi 9 Activ

గ‌త సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్‌లో రెడ్‌మీ 9 యాక్టివ్ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్‌ ప్ర‌స్తుత ధ‌ర రూ.9499. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెస‌ర్, 6.53 ఇంచ్ డిస్‌ప్లే హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్, డ్యుయ‌ల్ కెమెరా సిస్ట‌మ్, 13 ఎంపీ మెయిన్ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 10 వాట్స్ చార్జింగ్‌, ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్, ఎఫ్ఎమ్ రేడియో లాంటి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉంటాయి.

రియ‌ల్‌మీ నార్జో 50ఐ – Realme Narzo 50i

గ‌త సంవ‌త్స‌రం రియ‌ల్‌మీ నార్జో 50 సిరీస్‌ను లాంచ్ చేసింది. అందులో నార్జో 50ఐ, 50ఏ ఫోన్ల‌ను రిలీజ్ చేసింది. నార్జో 50ఐ మోడ‌ల్ 2జీబీ ప్ల‌స్ 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధ‌ర రూ.7499గా ఉంది. అదే 4 జీబీ ర్యామ్ అయితే రూ.8999గా ఉంది. నార్జో 50ఐ ఫోన్‌.. 6.5 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ యూనిసెక్ ప్రాసెస‌ర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 8 ఎంపీ రేర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ లాంటి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎం12 – Samsung Galaxy M12

సామ్‌సంగ్ గెలాక్సీ నుంచి ఎం, ఎఫ్ సిరీస్ ఫోన్లు త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి. గెలాక్సీ ఎం12 ఫోన్ ప్రారంభ ధ‌ర రూ.9499 మాత్ర‌మే. ఈ ఫోన్.. 6.5 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ, 2 జీహెచ్‌జెడ్ ఎక్సినోస్ ప్రాసెస‌ర్, క్వాడ్ కెమెరా సెట‌ప్, 48 ఎంపీ మెయిన్ సెన్సార్, 5 ఎంపీ సెకండ‌రీ సెన్సార్, 2 ఎంపీ సెన్సార్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ లాంటి ఫీచ‌ర్ల‌తో రిలీజ్ అయింది.

అలాగే రూ.8999 కే పోకో సీ31(Poco C31), రూ.8999 కే Micromax IN 2B ఫోన్, రూ.9399 కే Lava Z4 ఫోన్, రూ.8099కే Tecno Spark 8C ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat