Home / MOVIES / భీమ్లా నాయక్ దర్శకుడుకి బంపర్ ఆఫర్

భీమ్లా నాయక్ దర్శకుడుకి బంపర్ ఆఫర్

ాప్పుడేప్పుడో విడుదలైన ‘అయ్యారే’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న సాగర్ కె చంద్ర.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మూవీతోనూ మెప్పించాడు. అయితే దర్శకుడిగా బ్రేక్ రావడానికి మాత్రం అతడికి పదేళ్ళు పట్టింది. పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’ చిత్రాన్ని తెరకెక్కించే అరుదైన అవకాశం దక్కించుకొని దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో  లేటుగానైనా మనోడికి టాలీవుడ్ బడా నిర్మాతల నుంచి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

ఆల్రెడీ ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. త్వరలోనే సినిమాని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇందులో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక దీంతో పాటు సాగర్ మరో సినిమాకి కూడా కమిట్ అయినట్టు సమాచారం.భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై మరో పెద్ద సినిమాను సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయబోతున్నాడట.

త్వరలో ఈ ప్రాజెక్ట్ వివరాలు కూడా అఫీషియల్ గా తెలియబోతున్నాయి. ఇందులో హీరో ఎవరనేది కూడా అప్పుడే తెలియనుంది.   మొత్తానికి పదేళ్ళుగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సాగర్ కె చంద్ర కెరీర్ ను పవర్ స్టార్  ‘భీమ్లానాయక్’ చిత్రం సరికొత్త మలుపు తిప్పడం విశేషం. మరి ఈ ఆఫర్స్ ను అతడు ఇంకే రేంజ్ లో సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి మరి. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat