Home / MOVIES / RRR మూవీపై ఐకాన్ స్టార్ పొగడ్తల వర్షం

RRR మూవీపై ఐకాన్ స్టార్ పొగడ్తల వర్షం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మంచి జోష్ లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన  ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ట్విట్టర్ వేదికగా బన్నీ దర్శకధీరుడు జక్కన్నను పొగుడుతూ సినిమా ఇండస్ట్రీకి  ఇంత గొప్ప సినిమా అందించినందుకు దర్శక ధీరుడు రాజమౌళికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు అల్లు అర్జున్. రాజమౌళి గారి విజన్‌కు ఫిదా అయిపోయాను.

ఈ సినిమాలో రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని.. ఆయనను చూసి ఎంతో గర్వపడుతున్నట్లు ఐకాన్  స్టార్ తెలిపారు. మరోవైపు  జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు.. అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. తారక్ నటనను డైనమిక్ పవర్ హౌస్‌తో పోల్చారు . ఈ మూవీలో అత్యంతకీలకమైన పాత్రలు పోషించిన అజయ్ దేవగన్, అలియా భట్ నటనను కూడా బన్నీ పొగిడారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat