Home / MOVIES / RRR ఫస్టాఫ్‌తోనే ఆపేసి సినిమా అయిపోయిందన్నారు..

RRR ఫస్టాఫ్‌తోనే ఆపేసి సినిమా అయిపోయిందన్నారు..

థియేటర్‌లో ట్రిపుల్‌ ఆర్‌ (RRR) సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఫస్టాఫ్‌ అవగానే సినిమా పూర్తయిందంటూ థియేటర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించడంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు.  ఈ ఘటన అమెరికాలోని సినీమార్క్‌ థియేటర్‌లో చోటుచేసుకుంది.

సినిమా మొత్తం 3 గంటలకు పైగా ఉంటుందని.. ఫస్టాఫ్‌తోనే ఎలా ఆపేస్తారని మేనేజ్‌మెంట్‌ను కొందరు ప్రశ్నించారు. మూవీ 3 గంటలు ఉంటుందని తమకు తెలియదని అందుకే ఫస్టాఫ్‌తోనే సినిమా ఆపేశామని మేనేజర్‌ వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికి సెకెండాఫ్‌ను వేశారు. ఈ విషయాన్ని రివ్యూయర్‌ అనుపమ చోప్రా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. థియేటర్‌ మేనేజ్‌మెంట్‌కు అవగాహన లేకపోవడంతోనే ఇలా జరిగిందన్నారు. గతంలో చాలా ఇండియన్‌ సినిమాలకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat