ప్రతోక్కరూ ఈ రోజుల్లో ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయకుండా కొంతమంది. బ్రష్ చేశాక ఇంకొంతమంది టీ లేదా కాఫీ తాగడం అలవాటుగా ఉంటది. అయితే కాఫీ తాగడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
మాములుగా కాఫీ తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు అందరూ. అయితే ఆరోగ్య సమస్యలేమో కానీ కాఫీ తాగితే గుండెకు ఎంతో మంచిదని అంటున్నారు. రోజు కనీసం రెండు నుండి మూడు కప్పుల కాఫీ తాగితే గుండెకు ఎంతో మేలు జరుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది.
కాఫీ తాగడం వల్ల హృద్రోగాలు,గుండె సంబంధిత సమస్యలతో తక్కువ వయసులోనే మరణించడం వంటి సమస్యలు పది శాతం నుండి పదిహేను శాతం మేర తగ్గుతాయని ఈ అధ్యయానం చెబుతున్నది. గత పదేండ్లుగా బ్రిటన్ లో ఐదు లక్షల మందిపై నిర్వహించిన అధ్యయనం మేరకు ఈ ఫలితాలను చెబుతున్నారు.