Home / MOVIES / బేబమ్మ On Duty-నక్క తోక తొక్కిందిగా..?

బేబమ్మ On Duty-నక్క తోక తొక్కిందిగా..?

ఉప్పెన మూవీతో ఇటు క్లాస్ అటు మాస్ ఆడియన్స్ మదిని దోచింది బేబమ్మ కృతిశెట్టి. ఆ తర్వాత నేను మంచిగా ఉన్నంతవరకే సర్పంచ్ నాగలక్ష్మీ.. తేడాలోస్తే సింహాం నాగలక్ష్మీ అంటూ మాస్ డైలాగ్స్ తో పాటు అందాలను ఆరబోసి యువత గుండెల్లో గుబులు రేపింది ఈ హాట్ క్యూట్ బ్యూటీ..

తాజాగా కృతిశెట్టి ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సూర్య కథానాయకుడిగా దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత విలక్షణ నటుడు బాల దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

నిన్న సోమవారం నుండి ఈ మూవీ కన్యాకుమారిలో రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటుంది. 2డీ ఎంటర్ ట్రైన్మెంట్ పతాకంపై సూర్య ,జ్యోతిక సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజశేఖర్ పాండియన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈచిత్రంలో అవకాశం రావడంపై కృతిశెట్టి స్పందిస్తూ సూర్య లాంటి హీరో.. బాల లాంటి దర్శకత్వంలో అవకాశం దక్కడం నా అదృష్టం అని అంటుంది ఈ ముద్దుగుమ్మ.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat