Home / SLIDER / అందరికి స్ఫూర్తిదాయకమైన ఆదర్శనేత డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌

అందరికి స్ఫూర్తిదాయకమైన ఆదర్శనేత డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌

సమాజంలో  కులరహిత సమాజం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత అని పేర్కొన్నారు.

మంగళవారం జగ్జీవన్‌రామ్‌ 115వ జయంతిని పురస్కరించుకొని దేశానికి ఆయన చేసిన సేవల్ని సీఎం స్మరించుకొని నివాళులు అర్పించారు. జగ్జీవన్‌రామ్‌ వంటి మహానీయుల ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

తద్వారా సామాజిక, ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని తెలిపారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న దళిత సమాజాభివృద్ధికి పాటుపడుతున్నదని సీఎం పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat