ఈరోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌డే. ఎంతో మంది ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. దీంతో అల్లు అర్జున్ వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ లెటర్‌ను పోస్ట్ చేశారు.
నా 40 ఏళ్లు వెనక్కి తిరిగి చూస్తే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోందని బన్నీ చెప్పారు. నా ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు, గురువులు, శ్రేయోభిలాషులు, సినీ ఇండస్ట్రీ వాళ్లు, ప్రేక్షకులు.. ఇలా అందరి ప్రేమ, ఆశీస్సుల వల్లే ఈస్థాయిలో ఉన్నానని చెప్పారు. అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నందుఉ సంతోషంగా ఉందని.. తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెబుతున్నట్లు అల్లు అర్జున్ ఆ లేఖలో పేర్కొన్నారు.