ఒకవైపు ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సర్కార్ తగ్గేదే లే అంటూ ముందుకు సాగుతోంది.
ఇందులో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఆర్డెర్ లను తమ దేశంలోకి ప్రవేశించకుండా రష్యా నిషేధం విధించింది. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన మంత్రులు, పార్లమెంటేరియన్లు 228 మంది,న్యూజిలాండక్కు చెందిన 130 మందితో కూడిన నిషేధితుల జాబితాను విడుదల చేసింది.