తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు.. యువస్టార్ హీరో అక్కినేని నాగచైతన్యకు హైదరాబాద్ లోని బంజారాహీల్స్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు.
నగరంలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గర నిన్న సోమవారం స్థానిక ఎస్ఐ లఖన్ రాజ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అటుగా వస్తున్న హీరో నాగచైతన్య కారును ఆపేశారు పోలీసులు. హీరో నాగచైతన్య కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను గుర్తించారు. దాంతో కారుకున్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి హీరో నాగచైతన్య కు రూ.700లు జరిమానా విధించారు.