Home / MOVIES / RRR VS KGF-2 ఏది గొప్ప.. ఎవరు గొప్ప దర్శకుడు..?

RRR VS KGF-2 ఏది గొప్ప.. ఎవరు గొప్ప దర్శకుడు..?

ఒకరేమో బాహుబలి లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేసిన దర్శకధీరుడు. మరోకరేమో చిన్న మూవీగా విడుదల చేసి దాన్ని రేంజ్ పాన్ ఇండియా రేంజ్  అని ఫిక్స్ చేసిన దర్శకుడు. వీరిద్దరూ సినిమాలు థియేటర్ల దగ్గర పోటి పడితే ఆ కిక్కే వేరు ఉంటది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా ఆలియా భట్,శ్రియా,అజయ్ దేవగన్ ,రాజీవ్ కనకాల ,సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో డీవీవీ దానయ్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం RRR. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుందని ఫిల్మ్ నగర్లో వార్తలు.

అయితే గత కొన్ని సంవత్సరాల నుండి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న KGF  ఛాప్టర్ -2 థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ రెండు సినిమాల గురించి సోషల్ మీడీయా వేదికగా ఓ చర్చ జరుగుతుంది. అయితే RRR కంటే KGF-2 కి సోషల్ మీడీయా,వెబ్ మీడియాలో ఊహించని ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే అత్యంత తక్కువ బడ్జెట్ తో  తెరకెక్కిన ఈ మూవీ అందరి అంచనాలను మించి విజయం సాధించింది. ఈ క్రమంలో సోషల్ మీడియా.. వెబ్ మీడియాలో  KGF-2 మూవీ ఆర్ఆర్ఆర్ తర్వాత విడుదలై ఉంటే ఆర్ఆర్ఆర్ కి అంత క్రేజ్ ఉండకపోదు అని చర్చ జరుగుతుంది.ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 చిత్రాలలో  ఏది పెద్ద హిట్ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.

కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ నచ్చితే… హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం కేజీఎఫ్2 నచ్చుతుంది.రాజమౌళికి ప్రశాంత్ నీల్ కు రాబోయే రోజుల్లో కూడా గట్టి పోటీ ఇవ్వగలడని కేజీఎఫ్2 తో ఫిక్స్ అయింది.కేజీఎఫ్2 సినిమాలో కొన్ని సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయి.ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలలో కలెక్షన్ల విషయంలో కేజీఎఫ్2 పైచేయి సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.రాజమౌళి, ప్రశాంత్ నీల్ లలో ఎవరు గొప్ప  దర్శకులు ఎవరు  అంటే ఇద్దరూ గొప్ప  అనే చెప్పాలి.10,000కు పైగా స్క్రీన్లలో విడుదలైన కేజీఎఫ్2 ఎంట్రీతో ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ మాత్రం ముగిసినట్లేనని చెప్పాలి.సలామ్ రాఖీభాయ్ కి అంటూ ప్రేక్షకులు కేజీఎఫ్2 మూవీ విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat