తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చందమామ కాజల్ అగర్వాల్ మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ కొత్త ఇంటీ సభ్యుడికి కాజల్ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.కాజల్ అగర్వాల్ తల్లి అయిన వార్తను ఆమె సోదరి నిషా అగర్వాల్ వెల్లడించింది.
తల్లీ బిడ్డ క్షేమంగా .. ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అని ఆమె తెలిపింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను సరిగ్గా రెండేండ్ల కిందట కాజల్ అగర్వాల్ వివాహమాడిన సంగతి విదితమే. ఈ ఏడాది మొదట్లో జనవరి నెలలో కాజల్ అగర్వాల్ తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. తన వ్యక్తిగత జీవితంలోకి అడుగు పెట్టాక సినిమాలకు దూరంగా ఉంటున్నది కాజల్. అప్పటికే ఒప్పుకున్న ఇండియన్ -2 ,ఘోస్ట్ సినిమాలను వదిలేసింది.