శ్రీనిధి శెట్టి KGF మూవీ వరకు ఎవరికి పరిచయం లేని … అంతగా తెలియని పేరు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యష్ హీరోగా వచ్చిన KGF,KGF-2 చిత్రాల విడుదల తర్వాత ఈ ముద్దుగుమ్మ యావత్ సినీ కుర్రకారు యువతకు డ్రీమ్ గర్ల్ అయిపోయింది.
ఈ రెండు సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ అంతగా పాత్ర లేకపోయిన కానీ ఉన్న నిడివిలోనే తాను ఎంతటి ప్రాధాన్య పాత్ర లో నటించానో తన నటనతో అభినయంతో చెప్పకనే చెప్పింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా తనకు వచ్చిన ఫేం తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోవాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా మూవీలో తన అందంతో.. అభినయంతో అన్ని రకాల భాషాల సినీ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. అయితే తన దృష్టి మాత్రం కేవలం తెలుగు సినిమాల వైపు మళ్లినట్లు ఈ భామ సంకేతాలు ఇస్తుంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీకి చాలా మంది హీరోల పక్కన నటించడానికి అవకాశాలు వస్తున్నాయి. మంచి కథను ఎంపిక చేయడానికి బ్యూటీ కాస్త టైం గ్యాప్ ఇస్తుందంట. ఓ పెద్ద హీరోతో మంచి హిట్ పడితే శ్రీనిధి శెట్టి మరో అనుష్క శెట్టి కావడం ఖాయం అంటున్నారు సినీ క్రిటిక్స్ ..