Home / MOVIES / మరో అనుష్క శెట్టి కానున్న శ్రీనిధి శెట్టి

మరో అనుష్క శెట్టి కానున్న శ్రీనిధి శెట్టి

 శ్రీనిధి శెట్టి KGF మూవీ వరకు ఎవరికి పరిచయం లేని … అంతగా తెలియని పేరు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యష్ హీరోగా వచ్చిన KGF,KGF-2 చిత్రాల విడుదల తర్వాత ఈ ముద్దుగుమ్మ యావత్ సినీ కుర్రకారు యువతకు డ్రీమ్ గర్ల్ అయిపోయింది.

ఈ రెండు సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ అంతగా పాత్ర లేకపోయిన కానీ ఉన్న నిడివిలోనే తాను ఎంతటి ప్రాధాన్య పాత్ర లో నటించానో తన నటనతో అభినయంతో చెప్పకనే చెప్పింది ఈ ముద్దుగుమ్మ.  అయితే తాజాగా తనకు వచ్చిన ఫేం తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోవాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా మూవీలో తన అందంతో.. అభినయంతో అన్ని రకాల భాషాల సినీ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. అయితే తన దృష్టి మాత్రం కేవలం తెలుగు సినిమాల వైపు మళ్లినట్లు ఈ భామ సంకేతాలు ఇస్తుంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీకి చాలా మంది హీరోల పక్కన నటించడానికి అవకాశాలు వస్తున్నాయి. మంచి కథను ఎంపిక చేయడానికి బ్యూటీ కాస్త టైం గ్యాప్ ఇస్తుందంట. ఓ పెద్ద హీరోతో మంచి హిట్ పడితే శ్రీనిధి శెట్టి మరో అనుష్క శెట్టి కావడం ఖాయం అంటున్నారు సినీ క్రిటిక్స్ .. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat