తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి మంత్రి తన్నీరు హరీష్ రావుపై విమర్శలు వర్షం కురిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” మంత్రి హరీష్ రావుకు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయీ, అర్హత లేదని అన్నారు.
నిన్న పెద్దపల్లిలో మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘పోలీసు పహారాలేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చింది హరీష్? నీ పర్యటన నేపథ్యంలో పొలాలకు వెళ్లి పోలీసులు రైతులను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పు. ప్రజాసేవలో కాంగ్రెస్ త్యాగాలు నీలాంటి అల్పులకు అర్థం కావు.’ అంటూ మండిపడ్డారు.