టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఓ అపరిచితుడి మాదిరిగా, అరాచకం సృష్టించే వాడిగా తయారయ్యాడని మండిపడ్డారు.
నోరు తెరిస్తే బూతులు, అబద్ధాలే మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. పసుపు బోర్డుపై మాట తప్పిన అరవింద్‌ను జీవితాంతం బాండ్ పేపర్లు వెంటాడుతూనే ఉంటాయన్నారు. ఎమ్మెల్సీ కవిత సంస్కారంగా మాట్లాడితే.. అరవింద్ మాత్రం ఏకవచనంతో సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని కోపోద్రిక్తులయ్యారు.
స్పైస్ బోర్డుకు రూ. 6 కోట్ల నిధులు తెచ్చానని అరవింద్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన తెచ్చిన నిధులు కేవలం రూ. 2 కోట్లకు మించలేదన్నారు. నిజామాబాద్ ఎంపీగా కవిత జిల్లాకు ఎన్నో కోట్ల నిధులు తెచ్చి, అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. అరవింద్ ఎంపీగా గెలిచి మూడేండ్లు అవుతున్నా ఇప్పటి వరకు జిల్లాకు నిధులు తెచ్చిదేమీ లేదన్నారు.