Home / MOVIES / Social Media లో వైరల్ అవుతున్న తమన్ సరికొత్త ట్యూన్

Social Media లో వైరల్ అవుతున్న తమన్ సరికొత్త ట్యూన్

తెలుగుసినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో, వకీల్ సాబ్, అఖండ, భీమ్లా నాయక్ లాంటి సినిమాల సక్సెస్‌లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ పాత్ర అమోఘం. ఈ సినిమాలకు తమన్ అందించిన సాంగ్స్, బీజీఎం సినిమా సక్సెస్‌కు ముఖ్య కారణమని అభిమానులతో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం తమన్ ప్రిన్స్ సూపర్ స్టార్  మహేశ్ బాబు హీరోగా నటించిన పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్‌లతో పాటు కళావతి, పెన్నీ సాంగ్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ప్రస్తుతం ఈ మూవీకు సంబంధించిన డీటీఎస్ మిక్సింగ్ వర్క్ జరుగుతోంది. దీనిలో భాగంగానే తాజాగా ఓ కొత్త ట్యూన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ మూవీకి సంబధించి వినని ఓ సరికొత్త ట్యూన్ కావడంతో అభిమానులనే కాక ప్రేక్షకులను ఈ ట్యూన్ బాగా ఆకట్టుకుంటోంది.

14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్  బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat