తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు కాసం బ్రదర్స్ అధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన “వర్ణం” వస్త్ర దుకాణం షాపింగ్ మాల్ ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నిపరిశీలించారు. నిర్వాహకులు ఓం నమః శివాయ ను అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు. మరింతగా ప్రజలకు చేరువై, మంచిగా విస్తరించాలని కోరుకున్నారు. మంత్రి వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఉన్నారు.