సినీ హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ వరంగల్‌లో సందడి చేశారు. వరంగల్ చౌరస్తాలోని జేపీఎన్ రోడ్లో కొత్తగా కాసం గ్రూపు ఏర్పాటు చేసిన వర్ణం షాపింగ్ మాల్‌ను నాగ చైతన్య, అను ఇమ్మాన్యుల్ కలిసి ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అయితే నాగచైతన్య, అను ఇమ్మాన్యుల్‌ను చూసేందుకు జనాలు ఎగబడ్డారు.