దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,569 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 28.7శాతం తక్కువని పేర్కొంది.
తాజాగా వైరస్‌తో 19 మంది మృతి చెందగా.. 24 గంటల్లో 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,25,370కి పెరిగింది. ఇందులో 4,25,84,710 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 5,24,260 మంది ప్రాణాలు వదిలారు. దేశంలో ప్రస్తుతం 16,400 యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం చెప్పింది.