టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి దుమ్మురేపుతున్నాడు. ఓ కలర్‌ఫుల్ డ్రెస్సులో వెరైటీగా దర్శనమిస్తున్నాడు. మెరుపుల జాకెట్ వేసుకున్న రవిశాస్త్రి తన కొత్త ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేశారు. పబ్‌లో స్వాగ్ తరహా పిక్స్‌తో నెటిజెన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాడు.
‘Good mornings’ are optional if you haven’t slept at all. pic.twitter.com/4OhSYEg3Ln
— Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022
బ్లూ షైనింగ్ జాకెట్.. డిస్కో కళ్ల అద్దాలు.. మెడలో భారీ చెయిన్‌తో ఓ డాన్ స్టయిల్లో రవిశాస్త్రి తన లుక్‌తో అదరగొడుతున్నాడు. ఇక తన ఫోటోలకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా పోస్టు చేశాడు.
You’re in her DMs. She’s on my VIP guestlist. pic.twitter.com/eJTzoVKMz3
— Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022
చేయి పైకి లేపి సీరియస్ లుక్‌లో ఉన్న ఓ ఫోటోకు యమ క్రేజీ ట్యాగ్ ఇచ్చాడతను. నా ఫ్యామిలీ ముంబైలో జీవిస్తుంది, కానీ నేను మాత్రం ఈ క్షణమే జీవిస్తానన్న పంచ్ డైలాగ్ కొట్టాడు. రవి ఇంటెన్షన్ ఏంటో తెలియదు కానీ.. చాలా ఖతర్నాక్ పంచ్‌తో ఇరగదీశాడు.
My family lives in Mumbai and I live in the moment. pic.twitter.com/22BBncYoDL
— Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022