TRS తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ఆయన చేత రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ప్రమాణం చేయిస్తారు.
ఈ నేపథ్యంలో గాయత్రి రవి ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనతోపాటు ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు కూడా దేశ రాజధానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొననున్నారు.