పార్టీ కోసం ఎంతో చేసినా తనను తీవ్రంగా అవమానించారని సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆరోపించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ ద్వారా ఆమె ప్రకటించారు. కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
మూడేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడితే కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయిందన్నారు. మహానాడు వేదికగా తనను అవమానించారని ఆరోపించారు. ఒక కళాకారుడు (ఎన్టీఆర్) స్థాపించిన పార్టీలో కళాకారులు మాట్లాడే అవకాశం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.