Home / SLIDER / రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పం

రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పం

రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమించేది అందుకోసమే నని ఆయన స్పష్టం చేశారు. వానాకాలం పంటల సాగుపై బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా కేంద్రంలోనీ ఓ ప్రవైట్ ఫంక్షన్ హాల్ లో నల్లగొండ, యాదాద్రి జిల్లాలకు చెందిన రైతుల అవగాహన సదస్సుతో పాటు ఈ మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో జరిగిన రైతుల అవగాహన సదస్సులో ఆయన సహచర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లతో కలసి ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ లాభదాయక పంటల వైపు రైతులు దృష్టి సారించారలని సూచించారు. కూరగాయలకు ఉన్న డిమాండ్ ను ఆయన సోదాహరణంగా వివారిస్తూనే ఇప్పటికి పొరుగు రాష్ట్రాల నుండి దిగుమతి చేసుఉంటున్న వైనాన్ని ఆయన ప్రస్తావించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సారవంతమైన భూములు ఉన్నాయని అందులో 70 నుండి 80 శాతం మేర ఎర్ర చెలుక భూములే నని బంగారం పండించేందుకు ఇంతకంటే అనువైన భూములు మరెక్కడా లేవన్నారు.అందుకే మూస పద్ధతిని విడనాడి ప్రత్యమ్నాయం వైపు చూడాలని ఆయన కోరారు.


వ్యవసాయం విషయంలో 2014 కు ముందు వెనుక అన్న ఘట్టాలు ఉంటాయని వాటిని గుర్తు చేసుకుంటే 2014 తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎటువంటి ఫలాలు రైతులు పొందారో అన్నది ఇట్టే అవగతమౌతుందన్నారు.2014 కు ముందు కరెంట్ కోసం ధర్నాలు చేసిన చోట నే 2018 తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సరఫరా చేస్తున్న నాణ్యమైన ఉచిత విద్యుత్ కు కాసేపు విరామం ప్రకటించండి ప్రభు అంటూ మొరపెట్టుకునే దాకా విజ్ఞప్తులు వస్తున్నాయి అంటే విద్యుత్ రంగంలో ఎటువంటి అద్భుతాలు సృష్టించాము అన్నది తెలుస్తోందన్నారు.సాగు నీటిని వదిలి పెట్టి త్రాగు నీటి కోసం పాతాళం లోకి తొంగి చేసి ఫ్లోరోసిస్ బారిన పడిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2014 తరువాత ఒక్కటీ అంటే ఒక్కటి కూడా ఫ్లోరోసిస్ కేసు నమోదు కాలేదు అంటూ కేంద్రం సర్టిఫై చేసింది అంటే దాని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన భగీరథ ప్రయత్నం ఎంత ఉంటుందో నన్నది ఉమ్మడి నల్లగొండ జిల్లాల ప్రజలు ఆలోచన చెయ్యాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతెందుకు కరెంట్ ఉండక నీళ్లు అందక మోటార్లు కాలిపోయి నానా అగచాట్లు పడుతున్న నల్లగొండ జిల్లాలో నీళ్లను తగ్గించండి మహాప్రభో అంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారుఅంటేనే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నీటి లభ్యత ఎంత అన్నది తెలిసిపోతుందన్నారు.

అందుకే 2014 కు పూర్వం కేవలం నాలుగు అంటే నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ప్రస్తుతం 47 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి కి పెరిగింది అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత కు నిదర్శనం కాదా అని ఆయన ప్రశ్నించారు.దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి కావాల్సిన నీళ్లు,విద్యుత్,పెట్టుబడి సాయం అందించారని ఆయన తెలిపారు.ఉత్పత్తి దారుడు తమ తమ ఉత్పత్తులకు ధరలను నిర్ణయించుకున్న రీతిలో రైతులు తాము పండించిన పంట కు తామే ధరనునిర్ణయించుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. దానిని అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలను ఏర్పాటు చేశారన్నారు.రైతులను రైతు వేదికల ద్వారా సమన్వయం చేసి యావత్ రైతాంగాన్ని సంఘటితం చెయ్యడం ద్వారా తాము పండించిన పంటకు తామే ధరను నిర్ణయించుకునేలా ప్రోత్సాహించేందుకే రైతు వేదికల నిర్మాణమని ఆయన పేర్కొన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడుమరియు శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి
నల్లగొండ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,సూర్యాపేట జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు,రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి సభ్యులు యం సి కోటిరెడ్డి,రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,యన్.భాస్కర్ రావు,చిరుమర్తి లింగయ్య, రవీంద్రకుమార్,మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి నల్లగొండ, భోనగిరి, సూర్యాపేట రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామచంద్ర నాయక్,రజాక్, అమరెందర్ గౌడ్ నల్లగొండ, భోనగిరి యాదాద్రి జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్,పమేలా సత్పతితదితరులు పాల్గొన్నారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar