దేశంలో ఎక్కువగా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే అత్యధిక శిశుమరణాలు సంభవిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది.
ఆ రాష్ట్రంలో ప్రతీ వెయ్యి మంది నవజాత శిశువుల్లో 43 మంది మృత్యుఒడిలోకి చేరుకొంటున్నారు. మిజోరంలో అతి తక్కువ శిశుమరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రతి వెయ్యిమంది శిశువులకు ముగ్గురు మరణిస్తున్నారు.
మొత్తంగా ఏడాది నిండకుండానే దేశంలో ప్రతి 36 పసికందుల్లో ఒకరు కన్నుమూస్తున్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా.. శిశు మరణాల రేటు (ఐఎంఆర్), 2020 నివేదికలో వెల్లడించింది.