బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా పలువురు నటులు వైరస్ బారిన పడటానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే వేడుకలే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.
మే 25న తన 50వ బర్త్ డే వేడుకల్ని యశ్జ్ స్టూడియోలో కరణ్ ఘనంగా చేసుకున్నారు. షారూక్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో కనీసం 50 మంది కరోనా బారిన పడ్డారన్న వార్తలొస్తున్నాయి. షారూక్, కత్రినా, అదితి రాయ్కి కోవిడ్ సోకింది.