బాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలవరం చోటు చేసుకుంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్‌ను కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆదివారం రాత్రి జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్న సిద్ధాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ వినియోగంపై సమాచారం అందడంతో పార్టీ జరిగిన ఎంజీ రోడ్‌లోని హోటల్‌పై పోలీసులు దాడులు చేపట్టారు. డ్రగ్స్ తీసుకున్నారనే 35 మంది అనుమానితుల రక్త నమూనాలను పోలీసులు పరీక్షల కోసం పంపారు.సిద్ధాంత్ కపూర్ సహా ఆరుగురి శాంపిల్స్ పాజిటివ్‌గా రావడంతో వారిని అరెస్ట్ చేశారు.
వారు డ్రగ్స్ తీసుకుని హోటల్లో పార్టీకి హాజరయ్యారా లేక పార్టీలోనే డ్రగ్స్ తీసుకున్నారా అనే వివరాలు వెల్లడి కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. శక్తికపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్ 2020 వెబ్‌సిరీస్ భూకాల్తో పాటు షూటవుట్ ఎట్ వదాలా, అగ్లీ, హసీనా పర్కర్, చెహ్రే వంటి సినిమాల్లోనూ నటించారు.భాగం భాగ్, చుప్ చుప్ కే, భూల్ భులైయ, ధోల్ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశారు.