తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. జూన్ 2న నాగోల్ బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ‘అమరుల యాదిలో’ సభను నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరుస్తూ ఓ స్కిట్ వేశారు.
ఈ వ్యవహారంలో బీజేపీ నేతలు రాణిరుద్రమ, దరువు ఎల్లన్నను పోలీసులు అరెస్ట్ చేయగా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్కు నోటీసులు జారీ చేశారు. ఇదే విషయంలో బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా ఆయన బెయిల్పై విడుదలయ్యారు.