తెలంగాణ పెట్టుబడుల ఆకర్షణలో దూసుకెళ్తాందని MSME ఎక్స్ ఫోర్ట్ కౌన్సిల్, బిల్ మార్ట్ ఫిస్టాక్ సంయుక్త అధ్యయనంలో తేలింది. 2014లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం, టీఎస్ ఐపాస్ అమలుతో ఏడేళ్లలో రాష్ట్రానికి రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. వీటి వల్ల ఏడేళ్లలో 5 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని తెలిపింది. 2021-22లో తెలంగాణ రూ. 11,964 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది.
