Home / POLITICS / దుర్మార్గపు ఆలోచనలతోనే ‘అగ్నిపథ్‌’: నారాయణ

దుర్మార్గపు ఆలోచనలతోనే ‘అగ్నిపథ్‌’: నారాయణ

నిరుద్యోగ యువత జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. దాని ఫలితమే దేశంలో హింసాకాండ అని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం సృష్టించినవేనని ఆయన విమర్శించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో నారాయణ స్పందించారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ను అర్ధంతరంగా ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులను మాయ చేసేందుకు దుర్మార్గపు ఆలోచనలతోనే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని నారాయణ విమర్శించారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri