Home / SLIDER / తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడింది. టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ (తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ)లో 82 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు శనివారం నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తులను ఈ నెల 27 నుంచి జూలై 11వరకు స్వీకరించనున్నారు. ఆగస్టు 14న ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు రాతపరీక్ష నిర్వహిస్తారు.

ఈ పోస్టులకు 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల వయస్సు కలిగిన ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మరో ఐదేండ్లు, దివ్యాంగులకు మరో 10 ఏండ్లు గరిష్ఠ వయోపరిమితి నుంచి మినహాయింపు ఇచ్చారు.

వివరాలకు http://tsnpdcl.cgg.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఆర్థికశాఖ ఇప్పటికే 45,325 ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. తాజా నోటిఫికేషన్‌తో కలుపుకొని ఇప్పటివరకు 20,473 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. త్వరలోనే మరికొన్ని నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat