Breaking News
Home / POLITICS / రేవంత్‌.. ఎవర్ని కొడతావ్‌? నువ్వేమనుకుంటున్నావ్‌?: మళ్లీ జగ్గారెడ్డి ఫైర్‌

రేవంత్‌.. ఎవర్ని కొడతావ్‌? నువ్వేమనుకుంటున్నావ్‌?: మళ్లీ జగ్గారెడ్డి ఫైర్‌

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ ముసలం రేగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా హైదరాబాద్‌ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్‌) ఆయన్ను కలిసి స్వాగతం పలికారు.

సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన యశ్వంత్‌సిన్హాను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎవరూ కలవొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. అయినప్పటకీ యశ్వంత్‌సిన్హాను వీహెచ్‌ వెళ్లి కలిశారు.

దీనిపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా బండకేసి కొడతానంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి టెంప్ట్‌ అయిపోయి ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బండకేసి కొట్టడానికి ఆయనెవరని నిలదీశారు.

‘‘రేవంత్‌.. ఏమనుకుంటున్నావు? ఎవరిని కొడతావ్‌? వీహెచ్‌ ఎవరనుకుంటున్నావ్‌? కాంగ్రెస్‌ని నువ్వేమైనా కొనుక్కున్నావా? మేము నీ పాలేర్లమా? వీహెచ్‌ వయసెక్కడ? నీ వయసెక్కడ? నీకేం విలువ ఉంటుందో పీసీసీ అధ్యక్షుడి పోస్టు దిగి చూడు. రేవంత్‌ సారీ చెప్పకపోతే సోనియా, రాహుల్‌గాంధీలకు లేఖ రాస్తాను’’ అంటూ తీవ్రస్థాయిలో జగ్గారెడ్డి ఫైర్‌ అయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino