తనను మోసం చేసిన వ్యక్తిపై బాధిత యువతి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని షీటీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. షీ టీం పోలీసుల వివరాల ప్రకారం..నగరంలోని మాదాపూర్ లో ఆపరేటర్ గా పని చేస్తున్న అఖిల్ ఓ యువతిని ప్రేమించాడు..
తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. తనను మోసం చేశాడని బాధిత యువతి షీటీంకు ఫిర్యాదు చేయగా విచారణలో నిజమని తేలింది.. అతన్ని కాచిగూడ పోలీస్ స్టేషన్ కు తరలించామని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.