తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ, హిందీ, భాషల్లో విడుదల కానున్న పొన్నియన్ సెల్వన్ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్, త్రిష, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమాలో నటుల లుక్స్ సామాజిక మాధ్యమంలో పంచుకొగా అవి వైరల్ అవుతున్నాయి.