Home / SLIDER / తెలంగాణ ఫుడ్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అర్హులకు ఆరోగ్యమైన ఆహారం

తెలంగాణ ఫుడ్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అర్హులకు ఆరోగ్యమైన ఆహారం

మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్ధానంలో వుందని తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్ర్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ కార్యాలయంలో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మేడే రాజీవ్ సాగర్ ను మంత్రి సత్యవతి రాథోడ్ గారు, ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం, ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి పెద్ద పీట వేసిందని స్పష్టం చేశారు.. గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడానికి 35,700 అంగన్ వాడి కేంద్రాల ద్వారా జనవరి 01, 2015 నుండి ఆరోగ్యలక్ష్మి క్రింద పోషక ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రస్తుతం అంగన్ వాడి కేంద్రాల ద్వారా 4.72 లక్షలమంది మహిళలు, బాలింతలు లబ్ది పొందుతున్నారు.

అలాగే 6 సం.ల లోపు వయసు ఉన్న 17.63 లక్షల మంది చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నామాని అన్నారు.ISO 2000:2005 సర్టిఫికేట్ పొందిన తెలంగాణ ఫుడ్స్ ద్వారా ఉత్పత్తి చేసిన బాలామృతంతో పాటు పోషక విలువలున్న విటమిన్లు, మినరల్స్ కలిగిన ఆహారాన్ని స్నాక్స్ గా 6 సంవతరాలలోపు పిల్లలకు ప్రభుత్వం సప్లై చేస్తుందని అన్నారు..ఆధునిక పద్దతి లోప్యాకింగ్ చేసిన బాలామృతం ఆహారాన్ని తెలంగాణలోని అంగన్ వాడి కేంద్రాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కూడా తెలంగాణ ఫుడ్స్ సరఫరా చేస్తున్నది తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat