కుండపోత వర్షాలు, భారీ వరదల నేపథ్యంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. నదీ ప్రవాహం 70 అడుగులు దాటి పోయింది. నదీ ప్రవాహాన్ని చూసి స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
భద్రాచలం పరిసరాల్లో ఎటు చూసినా వరద ప్రవాహామే కనిపిస్తోంది. దీంతో భద్రాచలం రామాలయంతో పాటు సమీప కాలనీలు నీట మునిగాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. ఇంతటి వరదను ఎప్పుడూ చూడలేదని యువత అంటున్నారు.