Home / SLIDER / తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణలో సర్కారు కొలువులకై ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉద్యోగాల జాతరలో భాగంగా మరో 2,440 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. విద్యాశాఖతో పాటు, స్టేట్‌ ఆర్కైవ్స్‌ డిపార్ట్‌మెంట్లలో పోస్టుల భర్తీకి అనుమతిఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కే రామకృష్ణారావు శుక్రవారం 5 వేర్వేరు జీవోలను జారీ చేశారు. ఇంటర్‌ విద్యలో 1,523 పోస్టులకు జీవో-117, కళాశాల విద్యలో 544 పోస్టులకు జీవో-118, సాంకేతిక విద్యలో 359 పోస్టులకు జీవో-116, స్టేట్‌ ఆర్కైవ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో 8 పోస్టులకు జీవో-114, ఇదే ఇన్‌స్టిట్యూట్‌లో 6 రిసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు జీవో-115ను జారీచేశారు.

వీటన్నింటినీ టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతిచ్చారు. వీటిలో ఇంటర్‌ విద్యలో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు, 40 లైబ్రేరియన్‌, 91 ఫిజికల్‌ డైరెక్టర్‌, ఆర్కైవ్స్‌ విభాగంలో 14, సాంకేతిక విద్యాశాఖలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 247 లెక్చరర్‌, 14 ఇన్‌స్ట్రక్టర్‌, 31 లైబ్రేరియన్‌, 5 మ్యాట్రన్‌, 25 ఎలక్ట్రీషియన్‌, 37 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులున్నాయి. కళాశాల విద్య (డిగ్రీ కాలేజీల్లో) 491 లెక్చరర్‌, 24 లైబ్రేరియన్‌, 29 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat