బాలీవుడ్ అగ్రహీరో రణ్‌వీర్‌సింగ్ ఇటీవల చేసిన న్యూడ్ ఫొటోషూట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం ఆయన తీయించుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఇష్యూపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఆలియాభట్.
ఆలియా తాను నటించిన డార్లింగ్స్ సినిమా ట్రైలర్ ఈవెంట్లో భాగంగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రణ్వీర్ ఇష్యూపై విలేకరు ప్రశ్నించగా.. రణ్వీర్ నాకు క్లోజ్ ఫ్రెండ్. న్యూడ్ ఫొటోషూట్‌పై మీరడుగుతున్న ప్రశ్ననే నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ రణ్వీర్ను ప్రేమించేవారే. ప్రస్తుతం ఈ ఇష్యూపై నెగిటివ్‌గా మాట్లాడటానికి నేను ఇష్టపడను అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
ఉపయోగం లేని విషయాలు పట్టించుకోను..
ఆలియా ప్రెగ్నెంసీపై వస్తున్న కామెంట్లకు స్పందిస్తూ.. ఒక అమ్మాయి ఏం చేసినా దాన్ని వివాదంగా చూపడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అలాంటి ఉపయోగం లేని విషయాలను నేను పెద్దగా పట్టించుకోను అని అన్నారు. ఇక మహిళలు కొన్ని ప్రత్యేకమైన విషయాలను ప్లాన్ చేసుకోరని అలా జరిగిపోతుంటాయి అని చెప్పుకొచ్చారు.