Home / CRIME / రోడ్డు యాక్సిడెంట్‌లో కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌ కుమార్తె మృతి

రోడ్డు యాక్సిడెంట్‌లో కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌ కుమార్తె మృతి

హైదరాబాద్‌ నగర శివారు శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ఫిరోజ్‌ఖాన్‌ కుమార్తె తానియా అక్కడికక్కడే మృతి చెందారు. తానియాతో పాటు ప్రమాణిస్తున్న ఆమె స్నేహితులు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరిగి వస్తుండగా శంషాబాద్‌ పరిధిలోని శాంతంరాయి వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. తానియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar