Breaking News
Home / SLIDER / కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌ ఇంట్లో విషాదం

కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌ ఇంట్లో విషాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్  నగరంలోని శంషాబాద్‌లో  ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌ పరిధిలోని శాతంరాయి వద్ద తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఓ యువతి మృతిచెందింది.. మరో ముగ్గురు గాయపడ్డారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.మృతిచెందిన యువతిని పీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ ఫిరోజ్‌ఖాన్‌ కుమార్తె తానియాగా (25) గుర్తించారు. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri