తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యంగ్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా మూవీలో నటించనున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయం గురించి నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తెలిపాడు.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు. మంచి కథ దొరికితే బాబాయ్ బాలయ్యతోనూ మూవీ నిర్మిస్తానని తెలిపాడు. అయితే ఎప్పుడన్నది చెప్పలేనన్నాడు.
బింబిసార ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ మూవీ తెలుగులో విజయం సాధిస్తే ఇతర భాషల్లో విడుదలకు ఆలోచిస్తాం. ప్రేక్షకుల అంచనాలకు 100% రీచ్ అవుతామనే నమ్మకం ఉంది. బింబిసార2 కథ కూడా సిద్ధంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నాడు.