Home / NATIONAL / లవర్‌కి హెచ్‌ఐవీ.. ఆ బ్లడ్‌ ఎక్కించుకున్న గర్ల్‌ఫ్రెండ్‌

లవర్‌కి హెచ్‌ఐవీ.. ఆ బ్లడ్‌ ఎక్కించుకున్న గర్ల్‌ఫ్రెండ్‌

ప్రియుడు లేదా ప్రియురాలిపై ప్రేమ ఉంటే దాన్ని ఎన్నో విధాలుగా వ్యక్తం చేయొచ్చు. కుటుంబసభ్యులు ఒప్పుకోకపోతే దానికీ ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయినా ఇవేమీ పట్టవన్నట్లు కొంతమంది మూర్ఖంగా వ్యవహరిస్తుంటూ కుటుంబాలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంటారు. అలాంటి ఘటనే అస్సాంలో చోటుచేసుకుంది.

సౌల్‌కుచి జిల్లాకు చెందిన ఓ యువకుడిని ఓ యువతి ప్రేమిస్తోంది. ఫేస్‌బుక్‌లో చిగురించిన స్నేహం ప్రేమగా మారింది. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేని విధంగా వారిద్దరూ ప్రేమలో మునిగిపోయారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. అయితే ప్రియుడికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉండటమే కుటుంబసభ్యులు అంగీకరించకపోవడానికి కారణంగా తెలిసింది.

ఎలాగైనా తమ ప్రేమను అంగీకరించేలా చేయాలని ఆ యువతి ఓ మూర్ఖమైన పనిచేసింది. ప్రియుడి హెచ్‌ఐవీ పాజిటివ్‌ రక్తాన్ని సిరంజీ ద్వారా బయటకు తీసి తాను ఎక్కించుకుని షాక్‌కి గురిచేసింది. ఇప్పటికైనా తమ ప్రేమను అర్థం చేసుకోవాలని తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులను కోరింది. ఈ ఘటన ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat