Home / MOVIES / ఆ క్షణం నేను ఎంతో బాధపడ్డా: నాగచైతన్య

ఆ క్షణం నేను ఎంతో బాధపడ్డా: నాగచైతన్య

తన కెరీర్‌ ప్రారంభంలో జరిగిన ఓ సంఘటన తననెంతో బాధపెట్టిందని సినీనటుడు నాగచైతన్య అన్నారు. ఆ సంఘటనతో సినిమాల కోసం థియేటర్‌కు వెళ్లడమే మానేశానని చెప్పారు. ‘లాల్‌సింగ్‌ చడ్డా’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడారు.

ప్రేక్షకుల రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూద్దామని తొలి సినిమా ‘జోష్‌’ ఆడుతున్న థియేటర్‌కు వెళ్లానన్నారు. ప్రేక్షకుల మధ్యే కూర్చొని సినిమా చూశానని.. తనను వాళ్లు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో తొలిరోజే ఆ సినిమా చూశానన్నారు. అయితే సినిమా స్టార్టింగ్‌లో అందరూ బాగా ఎంజాయ్‌ చేశారని.. ఫస్ట్‌ హాఫ్‌ అయ్యే సరికి మాత్రం చాలా మంది ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటకు వచ్చేశారని నాగచైతన్య గుర్తు చేసుకున్నారు. ఆ క్షణం తాను బాగా బాధపడ్డానని చెప్పారు.

ఆ అనుభవం తననెంతో భయపెట్టిందని.. ఎంతో నేర్పిందని వివరించారు. ఏదో ఒకరోజు థియేటర్‌కి వెళ్లి మళ్లీ ప్రేక్షకుల మధ్యే కూర్చొని సినిమాను ఎంజాయ్‌ చేస్తానని చైతూ చెప్పుకొచ్చాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat