ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్ మూవీకి సంబంధించి సరికొత్త అప్డేట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది టీమ్. శృతిహాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సెప్టెంబరు 28న ప్రేక్షకులముందుకు రానుందని ప్రకటించింది సలార్ టీమ్. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ. ప్రస్తుతం ఆ పోస్టర్ సలార్ ఆగమనం అనే ట్యాగ్‌తో ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు అభిమానులు అన్న వస్తుండు అంటూ సందడి చేస్తున్నారు.
