ఒక పక్క చక్కని అందం. మరోపక్క అందర్ని మెప్పించే నటన కలగల్సిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. వరుస ఆఫర్లతో ఈ హాట్ గుమ్మ స్టార్ హీరోయిన్ పోటిలో ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ భామ ప్రముఖ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన మూవీ కార్తికేయ 2.
ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుత మూవీ ముచ్చట్లతో పాటు ‘రౌడీబాయ్స్’లో ముద్దు సీన్ల గురించి తెలిపింది. కార్తికేయ 2లో కృష్ణతత్వం కాన్సెప్ట్ నచ్చే.. మరికొన్ని ప్రాజెక్ట్స్‌ను సైతం వదులుకున్నట్లు పేర్కొంది. రౌడీబాయ్స్ లో కథ డిమాండ్ మేరకే ముద్దుసీన్లలో నటించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.