Site icon Dharuvu

తనంటే నాకు చాలా ఇష్టం.. పెదవి విప్పిన చైతూ..!

లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్‌లోకి వచ్చిన చైతూ ఇటీవల ఓ ఇంగ్లీష్ న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన మనసులోని మాటలను బయటపెట్టారు. తన ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ గురించి చెప్పారు.

బాలీవుడ్ హీరోయిన్ మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు చైతన్య. అంతే కాకుండా ఆలియా భట్ ప్రతి సినిమాలోనూ అద్భుతంగా నటిస్తుందని, తన యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, ఆలియాతో నటించే అవకాశం వస్తే వదులుకోనని చైతు చెప్పారు.

ఒకవేళ మీ ఆటోబయోగ్రఫీ రాయాల్సి వస్తే దానికి ఏం టైటిల్‌ పెడతారు? అని అడగగా.. నా ఆటోబయోగ్రఫీకి జీవితాన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దు.. అనే టైటిల్‌ పెడతా అని చైతూ బదులిచ్చారు. ఏదైనా ఐలాండ్‌లో చిక్కుకుపోతే అప్పుడు మీతో ఎవరు ఉండాలని కోరుకుంటారని అడగగా.. నాకెంతో ఇష్టమైన మ్యూజిక్‌ ఉండాలనుకుంటా. నా మనసుకు దగ్గరైన ఓ అందమైన మహిళతో సమయాన్ని గడపాలనుకుంటా. మేమిద్దరం సరదాగా మాట్లాడుకుంటాం అని చైతన్య వివరించారు.

Exit mobile version