కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కు చెందిన బస్తీ వాసులు ఈరోజు ఆదివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తమ కాలనీలో మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ మరియు సీసీ రోడ్లు పూర్తి చేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యే గారిని కోరారు. దీంతో ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆయా పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శాకిర్, సలీం, నర్సింహా, కిష్టయ్య, అజిష్ తదితరులు పాల్గొన్నారు.