వెస్ట్ బెంగాల్‌లోని ఓ మార్కెట్లో చెత్తకుప్ప దగ్గర అనుమానస్పదంగా ఉన్న ఓ బ్యాగ్ అక్కడి స్థానికుడి కంట పడింది. తెరచి చూడగా ఒక్కసారిగా అతడికి దమ్మతిరిగిపోయింది. ఇంతకీ ఆ బ్యాగ్‌లో ఏముందో తెలుసా..
సిలిగుడి ప్రాంతంలోని నక్సల్భరీ మార్కెట్లో ఓ వ్యక్తి కంట బ్యాగ్ కనపడింది. తెరచి చూడగా అందులో పుర్రె, వెన్నుముకలు, కాళ్లు చేతుల ఎముకలు ఉన్నాయి. స్థానికులు సైతం భయపడి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ బ్యాగ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ ఎముకలపై ఇంగ్లీష్ అక్షరాలతో ఉన్న పేర్లను డాక్టర్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.