తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో తెలంగాణ సీపీఎం నేతలు సమావేశమయ్యారు. కేసీఆర్తో సమావేశమైన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు ఉన్నారు.
ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నిక, రాజకీయ అంశాలతో పాటు బీజేపీ వైఖరిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సీపీఎం మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.