తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి..ఈ క్రమంలో సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది.
రాష్ట్రంలోని మాజీ ఎమ్మె ల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్ధన్‌కు సంతాపం అనంతరం సభ వాయిదా పడనున్నది. అనంతరం మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభా వ్యవహారాల నిర్వహణ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనున్నది.